అనుకున్నదొక్కటి.. అయ్యిందొక్కటి..
పాకిస్తాన్ రాజకీయాల్లో మళ్ళీ చక్రం తిప్పాలని భావించిన మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పాక్ రాజకీయాల్లో పాల్గొనకుండా పెషావర్ కోర్టు జీవితకాల నిషేధం విధించింది. రాజ్యంగాన్ని రెండుసార్లు రద్దు చేయడమే కాకుండా, 2007 ఎమర్జెన్సీ సందర్భంగా న్యాయమూర్తులను తొలగించిన కేసులో కోర్టు పైవిధంగా తీర్పునిచ్చింది.
మే 11న జరిగే పాక్ ఎన్నికల్లో పాల్గొనేందుకు తాను దాఖలు చేసిన 11 నామినేషన్లను తిరస్కరించడంపై ముషారఫ్ వేసిన పిటిషన్ ను కూడా కోర్టు కొట్టేసింది. ఈ తీర్పును తాము సుప్రీం కోర్టులో సవాల్ చేస్తామని ముషారఫ్ తరుపు న్యాయవాది తెలిపారు. ప్రస్తుతం ముషారఫ్.. బేనజీర్ భుట్టోపై హత్యాయత్నం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.